తలైవాయే సీఎం..చారు హసన్

తమిళనాడు రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి సూపర్ స్టార్ రజనీకాంతేనని కమల్ హసన్ సోదరుడు చారు హసన్ జోస్యం చెప్పారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టిన ఆయన.. రజనీని కన్నడ వ్యక్తి అని విమర్శిస్తున్న వారికి తన సంపూర్ణ విజయంతో ఆయన సమాధానం చెప్పనున్నారని అన్నారు.

 

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు రజనీతో పోల్చుకుంటే తన సోదరుడు కమల్ కు తక్కువేనని చారు హసన్ అభిప్రాయపడ్డారు. కమల్‌ను ప్రజలు మంచి నటుడిగా చూస్తారు. రాజకీయాల్లో మాత్రం అంత మద్దతు ఉంటుందని నేను అనుకోను అని ఆయన పేర్కొన్నారు.