రామ్ చరణ్ ప్రెస్టీజియస్ మూవీ ‘వినయ విధేయ రామ’ తిరగబడ్డం.. మెగా హీరోల స్టామినాపై సందేహాల్ని పుట్టిస్తోందా? బాక్సాఫీస్ వద్ద ‘మగధీరుడిగా’ పేరు తెచ్చుకుని, ‘రంగస్థలం’ హిట్టుతో పెర్ఫామెన్స్ పరంగా కూడా పీక్స్‌ని తాకేసిన చెర్రీని ‘వివిరా’ పతనావస్థకు చేర్చిందా? విషయంలో ఇంత ‘లోతు’ ఉందో లేదో తెలీదు గాని.. సినిమా కలెక్షన్ రిపోర్ట్స్ మాత్రం సరికొత్త మలుపుల్ని ఆవిష్కరిస్తోంది.

‘వివిరా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ మాత్రం తృప్తికరంగా లేవు. 92 సెంటర్స్‌లో కేవలం 56 కోట్ల 50 లక్షలు వసూలైనట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. పండగ సినిమాల్లో పేలవమైనది అంటూ ఒకవైపు నెగిటివ్ రివ్యూలు దంచికొడ్తున్నా.. అక్కడక్కడా కలెక్షన్ల సందడి మాత్రం కనిపిస్తూనే వుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 కోట్లు దండుకున్న మొట్టమొదటి ప్లాప్ మూవీ అనే క్రెడిట్ చరణ్ అభిమానులకు కాస్త ఊరటనిస్తోంది.

ఇదిలా ఉంటే.. కొన్ని సెంటర్స్‌లో ‘వినయ విధేయ రామ’ షోలు నిలిచిపోయినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియకముందే సంక్రాంతి సినిమా టపా కట్టెయ్యడం అనేది అసాధారణ విషయం. ఎంత డిజాస్టర్ మూవీ అయినా కనీసం పదిరోజులైనా ‘నడిపించడం’ మామూలే! ఈ విషయంలో అభిమానులే చొరవ చూపెడతారు. కానీ.. వివిరా మూవీ ప్రొద్దుటూరులో ‘ఎత్తేసినట్లు’ వెలువడ్డ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నాయి.

”ఫైనాన్స్, లైసెన్స్ సమస్య కారణంగా శుక్రవారం ఉదయం నుండి ‘వినయ విధేయ రామ’ ప్రదర్శనలు ప్రొద్దుటూరు పట్టణంలో నిలిపివేయబడినది. కడపజిల్లా అంతటా యిదే పరిస్థితి” అనే న్యూస్ మెగా ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. ‘శత్రు శిబిరాలు’ మాత్రం ఆనందంతో ఈలలేసి గోల మొదలుపెట్టేశాయి. ప్రొద్దుటూరు హక్కులను థర్డ్ పార్టీకి అమ్మేశారని, వాళ్ళు పేమెంట్ నిలిపివేయడంతో లైసెన్స్ రద్దు చేసుకున్నారని, దీంతో యువీ క్రియేషన్స్‌కి ఎటువంటి ప్రమేయం లేదని.. క్లారిటీ కూడా వస్తోంది. కానీ.. గ్రౌండ్ లెవెల్‌ రిపోర్ట్ మాత్రం సినిమాను ‘ఆడించే’ పరిస్థితులు లేవన్న క్లారిటీనిస్తోంది. F2 ధాటికి తట్టుకోలేక ‘ఆక్యుపెన్సీ’ కొరత ఏర్పడ్డం వల్ల మరికొన్ని చోట్ల కూడా సినిమా ఆపేశారంటూ జరుగుతున్న ప్రచారం.. మెగా ఫ్యాన్స్‌కి ఇరకాటమే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *