హ్యాండ్‌సమ్ అబ్బాయిల్ని ఏమంటారంటే..

సుశాంత్, రుహాణి శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘చిలసౌ’. ఇప్పటివరకూ నటుడుగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ రుహాణి శర్మకు ఇదే ఫస్ట్ మూవీ కావడం మరో విశేషం. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. హీరో పెళ్లి, ప్రేమ ప్రధాన కథాంశంగా మూవీ తెరకెక్కించినట్టు ట్రైలర్ లో స్పష్టమవుతోంది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం. వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా భారత్ కుమార్ నాయుడు మాలాసల, హరి పులిజల, జశ్వంత్ నదిపల్లి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ, సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా మూవీ రిలీజ్ చేస్తున్నాయి. ‘పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని ఎన్ని సార్లు అడుక్కోవాలి’, ‘హైదరాబాద్‌లో ఉండే హ్యాండ్‌సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా? టూరిస్ట్’ అనే డైలాగ్స్ తో కూడిన సన్నివేశాలు ట్రైలర్ చూపించారు. ఆగష్టు 3 న మూవీ రిలీజ్ కానుంది.