చైనాలో తయారైన ఐఫోన్ అమ్మకాలపై నిషేధం వేటు పడింది. తమ ఫోన్లు పేటెంట్ హక్కులను అతిక్రమించాయని ఆరోపణలు రావడంతో వీటి విక్రయాలను ఆ దేశం నిషేదించింది. వీటి దిగుమతిని, సేల్స్ ను బ్యాన్ చేయాలని కోరుతూ అమెరికా-కాలిఫోర్నియాలోని చిప్స్ సప్లయర్ ‘ క్వాల్ కామ్ ‘ చైనా కోర్టులో దావా వేసింది.

ఈ కేసులో ఈ సంస్థ నెగ్గడంతో ఇక ఈ ఫోన్ల సేల్స్ ను బ్యాన్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఐ ఫోన్ ఎస్ నుంచి ఐ ఫోన్ ఎక్స్ వరకు (పాత వెర్షన్లు) అన్నింటి పైనా బ్యాన్ వేటు పడక తప్పలేదు. అయితే ఓ కొత్త సాఫ్ట్ వేర్ తో తమ ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయని యాపిల్ సంస్థ ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే.. మొబైల్ ఫోన్లకు అతి పెద్ద చిప్స్ సప్లయర్ అయిన క్వాల్ కామ్ గత ఏడాది..చైనా లోని కోర్టులో కేసు దాఖలు చేసింది. తమ సంస్థకు చెందిన రెండు సాఫ్ట్ వేర్ పేటెంట్లను యాపిల్ అతిక్రమించిందని క్వాల్ కామ్ ఆరోపించింది. ఓ టచ్ స్క్రీన్ పై మేనేజింగ్ అప్లికేషన్స్ ను, ఫోటోలను యాపిల్ రీ-సైజ్ చేసిందని పేర్కొంది.

చైనా కోర్టు ఈ వాదనలను అంగీకరించింది. కాగా- తమ ఉత్పత్తులను బ్యాన్ చేయడానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నాలను ఖండించిన యాపిల్.. క్వాల్ కామ్ అక్రమాల గురించి ప్రపంచంలోని రెగ్యులేటర్లందరికీ తెలుసునని, వారు దీని నిర్వాకంపై దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొంది. అటు-ఐ ఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్, 7, 7 ప్లస్, 8, 8 ప్లస్, X ఫోన్లు నిషేధానికి గురయ్యాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *