తన మీద సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనకు దళితుల్ని దూరం చేయాలన్న కుట్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాల్లో ఇది భాగమేనని ఆయన ఆరోపించారు. తన వీడియోలు ఎడిట్ చేసి తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ ఆయన వాపోయారు. ఇలాఉండగా, గ్రామదర్శని కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం గ్రామంలో దళితులకు రాజకీయాలెందుకంటూ చింతమనేని కామెంట్లు అనే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపైనే చింతమనేని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *