మెగా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ని లీకుల బెడద వెంటాడుతోంది. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తలపెట్టిన ఈ సినిమా ఎంత వేగంగా రూపుదిద్దుకుంటోందో.. అంతే వేగంగా సెట్స్ నుంచి పిక్స్ లీక్ అవుతున్నాయి. అఫీషియల్‌గా రిలీజైన ఫస్ట్ లుక్ ఒక్కటే అయినా.. అనధికారిక లుక్స్ మాత్రం అరడజను దాకా వచ్చేశాయి. తాజాగా.. చిరంజీవి గెటప్‌కి సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతోంది.

అటవీ ప్రాంతంలో రాజసం ఉట్టిపడేలా ఒక చెట్టుకింద కూర్చున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ గెస్చర్ సోషల్ మీడియాను దున్నేస్తోంది. అటు.. మరో నటుడు విజయ్ సేతుపతికి సంబంధించిన మరో పిక్ కూడా బైటికొచ్చింది.

నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ‘సైరా’లో మిల్కీ బ్యూటీ తమన్నా మరో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విశిష్ట అతిధిపాత్రలో నటిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *