విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అండ లభించింది. ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, తమ సపోర్ట్ ఉంటుందని కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ ఆప్ ‘ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ని ప్రకాష్ రాజ్ గురువారం కలిశారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని ప్రకాష్ రాజ్ ఆ తరువాత తెలిపారు. పలు అంశాలపై తన బృందం రూపొందించినవాటిపై తాము చర్చించామని, వాటి పరిష్కారానికిసంబంధించి వివిధ మార్గాలను ఒకరికొకరు పంచుకోవాలని తాను కోరానని ఆయన వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకాష్ రాజ్ ఇటీవల ప్రకటించారు.

ఇదిలావుండగా ప్రకాష్‌రాజ్ ఎంచుకున్న బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గంలో విజయావకాశాలు ఏమాత్రం అన్న విశ్లేషణ‌లోకి వెళ్తే.. ఈ నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీమోహన్ రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడి నుంచే ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 12 లక్షలకు పైగా ఓటర్లు వున్నారు.

గత ఎన్నికల్లో ఆప్‌కి ఇక్కడ దాదాపు 40 వేలు, జేడీఎస్ 20 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి నాలుగు లక్షల 20 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎంపీ ఎవరన్నది డిసైడ్ చేసింది తమిళ ఓటర్లే! ఈ నియోజకవర్గంలో దాదాపు ఐదున్నరల లక్షల మంది తమిళ ఓటర్లు, నాలుగున్నర లక్షల మంది ముస్లింలు, రెండు లక్షల మంది క్రిస్టియన్ ఓటర్లు వున్నారు. వీళ్ల మద్దతును కూడగట్టడంలో ప్రకాష్‌రాజ్ సక్సెస్ అవుతారో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *