తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7గంటల నుంచి మొత్తం 119 స్థానాల్లో పోలింగ్‌ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కడుతుండగా, రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆ క్యూలలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు, ఓటు వేసిన అనంతరం సినీ సెలబ్రెటీలు ఓటు వేయండంటూ ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు.

ఓటు యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నారు. ఇక, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని తమ ఓటు మార్కుని చూపిస్తూ ఓటు ప్రాముఖ్యతను చాటుతున్నారు.

ప్రముఖ నటుడు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ తదితర సినీనటులు జూబ్లీహిల్స్‌లో, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్‌, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల ప్రాంతంలో ఓటు వేశారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *