కత్త్తి మహేష్‌పై కొత్త కేసు..!

‘సమకాలీన అంశాల్ని కెలుక్కోవడమనే’ కళలో ఆరితేరిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ గుర్తున్నాడా? అసలు మర్చిపోతే కదా గుర్తుకు తెచ్చుకోడానికి! పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ.. అడపాదడపా వార్తా ఛానళ్ల డిబేట్లలో మళ్ళీ మెరవడం మొదలుపెట్టి.. కొత్త కొత్త వివాదాలని ఆహ్వానించడం షురూ చేశారాయన. అదే ఒరవడిలో మరో గొడవలో దూరిపోయారు. ఒక చర్చలో పాలుపంచుకుంటూ.. రామాయణం వాస్తవం కాదని, రాముడు దేవుడు కాదని వాదించారు. అక్కడితో ఆగకుండా.. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై తీవ్ర విమర్శలు చేశారు.

రామాయణం అనేది రాసుకున్న కథ మాత్రమేనని, అందులో రాముడి పాత్ర ఎంత ఆదర్శవంతమో, అంత దగుల్బాజీ అని దుర్భాషలాడాడు. ఈ విషయాన్నే పేపర్ మీద పెట్టి.. ఆయన మా మనోభావాల్ని దెబ్బతీశారు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కొంతమంది. కత్తి మషేష్ పై హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్‌లో కేసు నమోదైంది. ఎన్నో గొడవల్ని టీకప్పులో తుపానుల్లా చల్లార్చగలిగిన కత్తి మహేష్.. దీన్నెలా ఎదుర్కొంటారో చూడాలి!