టాలీవుడ్‌లో నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు స్టార్ కమెడియన్ అలీ. వెండితెరపై ఆయన చేసే అల్లరి చేష్టలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సీనియర్ కమెడియన్ తెలుగు చిత్రపరిశ్రమలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు. 1979లో ప్రెసిడెంట్ పేర‌మ్మ సినిమాతో బాల‌ న‌టుడిగా వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన అలీ.. నటుడు, హీరో, యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్షకుల మ‌న‌సుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా సాంస్కృతిక సంస్థ సంగ‌మం ఆయ‌న‌ను ఈనెల 23న ఘ‌నంగా స‌న్మానించాల‌ని నిర్ణయించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ వేడుకలో అలీకి సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు స్వర్ణ కంకణంతో అలీని సత్కరించనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *