టీడీపీకి వెన్నుదన్ను బీసీలేనని, అది వైసీపీకి మింగుడుపడడం లేదన్నారు సీఎం చంద్రబాబు. ఈక్రమంలోనే బీసీ గర్జన సభలో జగన్ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడారని ఆరోపించారు. బీసీ ఉప ప్రణాళికకు టీడీపీ చట్టబద్దత కల్పించిందని, మళ్లీ చట్ట బద్దత కల్పిస్తామని జగన్ చెప్పడం, ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ సభ ద్వారా జగన్‌కున్న భయం బయటపడిందన్నారు. సోమవారం ఉదయం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

జయహో బీసీ సభ పెట్టి విజయవంతం చేశామని, అది చూసి జగన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారని అన్నారు సీఎం. అందుకే హడావుడిగా సభ పెట్టి.. నోటికి ఏదిపడితే అది మాట్లాడారని చెప్పుకొచ్చారు. జగన్ అద్దె మైకు కన్నా లక్ష్మీనారాయణ అని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో టికెట్ల వ్యవహారంపై కూడా బాబు మనసులోని మాట బయటపెట్టారు. గతంలో కంటే 2019-24కి మంచి టీమ్‌ని ఎంపిక చేస్తున్నామని, ఐవీఆర్ఎస్ ద్వారా అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు. ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్న బాబు.. నేడో, రేపో కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. అభ్యర్థులను వీలైనంత త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *