యుగ పురుషుడు ఎన్టీఆర్‌‌కు నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేస్తే, అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు ముఖ్యమంత్రి. దీన్ని 10 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది.

ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌‌లను ప్రారంభించారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామ సాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ సాగర్‌లో స్పీకర్‌తో కలిసి బోటులో విహరించారు. ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం వున్న స్పీకర్ కోడెలను అభినందించారు సీఎం చంద్రబాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *