రాబోయే ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ, అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. దీనిపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావిస్తున్న నేతలు, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రులు రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా, ఈ బాటలో మరికొందరు నేతలు రెడీ అవుతున్నారు. అందులో లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కరణం బలరాం, అన్నెం సతీష్‌తోపాటు డొక్కా వంటి నేతలు వున్నట్లు సమాచారం. నేతలు పోటీ చేసే ఆయా సీట్లపై స్పష్టత వచ్చాకే రాజీనామాలు చేయనున్నారు.

ఒక పదవి అనుభవిస్తూ.. మరో పదవి కోసం పోటీ చేయడం సబబు కాదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే తమ పదవులకు రాజీనామా చేసి.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగడం ద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచినట్లు అవుతుందని అధిష్టానం ఆలోచన. పైగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కనివాళ్లకి.. ఎమ్మెల్సీ సీటుతో సర్దుబాటు చేసేలా చంద్రబాబు కొత్త స్కెచ్ వేశారు. దీంతో కొత్తగా ఏర్పడే ఖాళీలతో కలిపి మొత్తం 13 మండలి స్థానాలకు కొత్తవాళ్లతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా పార్టీ నుంచి వలసల నివారణను అడ్డుకట్ట వేయవచ్చన్నది టీడీపీ ప్లాన్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *