మోదీ- చంద్రబాబుల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. సోమవారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షతో మోదీ సర్కార్‌లో గుబులు మొదలైంది. ఈ దీక్ష యావత్ దేశాన్ని ఆకర్షించింది. అంతేకాదు బాబు దీక్షకు 23 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇందులో శివసేన కూడా వుండడం గమనార్హం. పరిస్థితి గమనించిన బీజేపీ, బాబుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఐదేళ్లలో బీజేపీ ఏం చేసిందన్న దానిపై మూడుపేజీల లేఖను ఏపీ ప్రజలకు రాశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడమేకాకుండా దానికి ఇప్పటివరకు 6,764 కోట్లు విడుదల చేశామని, విభజన చట్టంలో పేర్కొన్నట్టుగానే 11 విద్యాసంస్థల్లో 10 సంస్థలు ఇప్పటికే పని చేస్తున్నాయని తెలిపారు. రాజధాని కోసం 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని వెల్లడించారు.

మరోవైపు షా లేఖపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు. ఏపీ ప్రజలపై కక్ష సాధిస్తూ, మీరు గౌరవం కోరుకుంటారా? అలాగే ఏపీ నుంచి కేంద్రానికి వచ్చిన ఆదాయం మాటేంటని ప్రశ్నించారు.  శ్రీకాకుళం వెళ్తే ఖాళీ కుర్చీలు స్వాగత మిచ్చాయని, మిమ్మల్ని ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్నారు. తాను యూటర్న్ తీసుకోలేదని, ఎప్పుడూ సరైన మార్గంలోనే వెళ్తానని అన్నారు సీఎం చంద్రబాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *