ఏపీలో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు సీఎం చంద్రబాబు. ఎన్నికల యుద్ధంలో వైసీపీ చేతులెత్తేసే పరిస్థితి వస్తుందన్నారు. సోమవారం ఉదయం టీడీపీ నేతలతో అధినేత టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరంపై తెలంగాణ మరోసారి సుప్రీంకోర్టు కేసు వేసిందన్న చంద్రబాబు, అలాంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌తో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సొంత బాబాయిని జగన్ రెండుసార్లు కొట్టారని వార్తలు వస్తున్నాయని, ఎంపీ పదవికి వివేకాతో బలవంతంగా రాజీనామా చేయించారని ప్రస్తావించారు. 10 లక్షల మంది సైన్యంతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించారని, 65 లక్షల పసుపు సైన్యం ద్వారా కోటి మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్ల అండతో సునాయాసంగా గెలవడం ఖాయమన్నారు. రైతులు, పింఛనర్లు, యువత, డ్రైవర్లు పార్టీకి అండగా వున్నారన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *