విభేదాలు పక్కనపెట్టండి, నేతలకు బాబు సూచన

విభేదాలు పక్కనపెట్టండి, నేతలకు బాబు సూచన

ఏపీలో ఎన్నికలకు కేవలం రెండువారాలు మిగిలివుండడంతో నేతలను అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు.  ఈ ఎన్నికలను ఎవరు తేలిగ్గా తీసుకోవద్దని, విభేదాలు మరిచి ఐక్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.  17 రోజులు అత్యంత కీలకమని, ప్రతీ నిమిషం, గంట సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచించారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఐదేళ్లలో ప్రజలకు చేయాల్సినంత చేశామని, వాటిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు.

పనిలోపనిగా వైసీపీ చేస్తున్న కుట్రల గురించి బయటపెట్టారు బాబు. నేరాలు – ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్‌ అని, అభివృద్ధి- సంక్షేమానికి బ్రాండ్ టీడీపీ అని అన్నారు. బాబాయిని చంపేస్తే దాచిపెట్టే వ్యక్తిని, పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. నేరాల్లో అనుభవమే తప్ప పరిపాలనలో అనుభవం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్తల సమాచారం చోరీ చేశారని, తమవాళ్లకే ఫోన్లు చేసి బెదిరిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ప్రలోభాలను అధిగమించాలని, వేధింపులను ఎదుర్కోవాలని నేతలకు సూచించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *