తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.

త్వరలోనే శాఖలను కేటాయించనున్నారు సీఎం కేసీఆర్. ఓవరాల్‌గా చూస్తే.. రెడ్డి సామాజిక వర్గానికి ఐదుగురు, బీసీలకు ముగ్గురు, ఎస్సీ, వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పించారు. ఈసారీ కూడా మహిళలకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. నిబంధనల ప్రకారం 18 మంది మంత్రులుగా చేయాల్సి వుండగా సీఎం కేసీఆర్‌తో కలిసి ఆ సంఖ్య 12కి చేరింది. మరో ఆరుగురు కేబినెట్‌లోకి రావచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే మరోసారి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల్లో బాగా పని చేసిన నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *