కుమారస్వామి బేరానికి జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఒప్పుకుందా?

పాపులర్ యాక్ట్రెస్, మాజీ మోడల్, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్.. జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడు కన్నడ గడ్డ మీద కన్నేసింది. ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరైన ఈ అమ్మడి కోసం కర్ణాటక సీఎం కుమారస్వామి వెయిటింగ్‌లో వున్నారన్నది శాండల్‌వుడ్ సమాచారం. ఇంతకీ.. జాక్విలిన్‌కీ, కుమారన్నకీ లింకేంటి? దేవెగౌడ కుటుంబంలో మూడో తరం మెగా వారసుడు.. నిఖిల్ గౌడ.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ హీరో స్టేటస్ దక్కించుకోవాలన్న కసి మీదున్నాడు. ‘జాగ్వార్’ పేరుతో ఒక భారీ ప్రాజెక్టు ద్వారా తెరంగేట్రం చేసినప్పటికీ అదంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ‘సీతారామ కళ్యాణ’ పేరుతో మరో మెగా మూవీ కోసం తంటాలు పడుతున్నాడు నిఖిల్.

 

అతడి కసికి, కమిట్మెంట్‌కీ ముచ్చటపడ్డ తండ్రి కుమారస్వామి.. తానూ ఒక చెయ్యేసి పుత్రోత్సాహం పొందాలని ప్రయత్నిస్తున్నారు. కొడుకును, అతడి సినిమాను ప్రమోట్ చేసుకోడానికి తన రాజకీయ పలుకుబడిని వాడుకోడానికి సైతం కుమారస్వామి సిగ్గుపడ్డం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అఫీషియల్ టూర్ మీద బెంగళూరుకెళ్ళి సీఎం కుమారస్వామి కలిస్తే.. అదే అదనుగా కొడుకు నిఖిల్ హీరోగా చేస్తున్న మూవీ సెట్స్ దగ్గరకు తీసుకెళ్లి సెల్ఫీలు తీయించి మార్కెట్లో పెట్టేశారా ముఖ్యమంత్రి గారు.

కట్ చేస్తే.. ఇప్పుడు జాక్విలిన్ ఫెర్నాండేజ్..! కుమారస్వామి కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ హౌస్ చన్నబిక ప్రొడక్షన్స్.. ఈ అమ్మడిని అప్రోచ్ అయ్యిందట. హిందీలో మంచి క్రేజ్ వున్న జాక్విలిన్.. కన్నడలో ఒక అప్కమింగ్ హీరో పక్కన చెయ్యడానికి తొలుత వెనుకాడింది. తర్వాత సీఎం చెబుతున్నారు చేస్తావా లేదా అనే ‘లాబీయింగ్’ షురూ చేయడంతో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. నిఖిల్ డెబ్యూ మూవీ ‘జాగ్వార్’లో సీనియర్ హీరోయిన్ తమన్నాను ఇలాగే బలవంతంగా ఒప్పించి ఐటెం సాంగ్ చేయించినట్లు వార్తలొచ్చాయి. హర్ష డైరెక్ట్ చేస్తున్న ‘సీతారామ కళ్యాణ’ మూవీలో నిఖిల్ పక్కన ఫిమేల్ లీడ్ రోల్ కోసం రచితా రామ్ ఫిక్స్ అయ్యింది. ఏ మాత్రం సిగ్నిఫికెన్స్ లేని ఈ మూవీకి జాక్విలిన్ లాంటి గ్లామర్ డాల్ యాడ్ అయితే.. సినిమాకు కాసింత కమర్షియల్ వ్యాల్యూ పెరుగుతుందని.. ఈ తండ్రీకొడుకుల ఆశ.