సంక్రాంతి వేళ కోడి కాలుదువ్వుతోంది. కోర్టులు, పోలీస్ వినతుల్ని తోసిరాజని ఎప్పటిలాగానే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలకు బరిలు సిద్ధమైపోయాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కోడిపందేలకు కేంద్ర స్థానంగా నిలుస్తోంది. గతేడాది ఏకంగా వేయి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలిస్తే, ఈ ఏడాది ఈ మొత్తం రెండు వేల కోట్లకు చేరుకోవచ్చునని సమాచారం. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో చేష్టలుడిగి చూడ్డం పోలీస్ ల వంతౌతోంది. పందేలు చూడటానికి తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో గోదావరి జిల్లాలకు తరలివస్తున్నారు. ఇప్పుడు కోడిపందాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా విస్తరించాయి. కోడి పందేల పక్కనే గుండాట, పేకాట, కోతాటలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాఉండగా, సంక్రాంతి వేళ పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం జరిగిన ఘటనలో ఎద్దుల భారిన పడి 13మందికి గాయాలవగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *