తెలంగాణలో ఖమ్మం లోక్‌సభ సీటు చివరకి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి దక్కింది. ఈ నియోజకవర్గానికి టికెట్ కోసం  కాకలు తీరిన పార్టీ సీనియర్లు పోటీ పడిన సంగతి తెలిసిందే. మాజీ ఎంపీ వీహెచ్,  ఒకదశలో రేవంత్ రెడ్డి వంటివారి పేర్లు వినిపించాయి. తెలంగాణాలో టీఆర్ఎస్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని నిలబడిన ఏకైక నియోజకవర్గం ఇదే.. దీంతో సీనియర్ల దృష్టి దీనిపై పడింది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి హేమాహేమీలు కూడా ఈ సీటును ఆశించారు. పైగా ఖమ్మం సీటును తనకు కేటాయించకపోతే.. తాను పార్టీ మారడమో లేక రాజకీయాలకు దూరంగా ఉండడమో చేస్తానని రేణుక తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో హెచ్చరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరకు ఈమె పంతం నెగ్గింది. పార్టీ అధిష్టానం ఈ స్థానాన్ని రేణుకకే కేటాయించింది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *