ప్లూటో గ్రహం ‘అంతు చూడ్డమనే’ మరో మహా ప్రయోగానికి నాసా తెర తీసింది. అంతరిక్షంలోని క్యూపర్ బెల్ట్ మీదున్న ‘అల్టిమా తులే’ అనే సుదూర లక్ష్యాన్ని ఛేదించడానికి జనవరి 1 అర్థరాత్రిని ముహూర్తంగా పెట్టుకున్న నాసా.. దానికి సంబంధించి కౌంట్‌డౌన్ షురూ చేసింది. ఈ మిషన్‌కి సంబంధించి రాబోయే 72 గంటలూ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి స్పేస్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ అన్నీ క్యూ కట్టేశాయి.

భూమికి 400 కోట్ల మైళ్ళ దూరంలో మిణుకుమిణుకుమంటూ మెరిసే ‘అల్టిమా తులే’.. మనిషి దృష్టిలోకొచ్చిన అత్యంత సుదూరంలోని ఆబ్జెక్ట్స్‌లో కీలకమైనది. 450 కోట్ల సంవత్సరాల పురాతనమైన సౌర వ్యవస్థతో పోల్చదగ్గది కూడా. ఈ కక్ష్య నిర్మాణానికి, ప్రయాణానికి సంబంధించిన ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా ప్రాధమిక దశను దాటలేకపోయింది. ప్రభుత్వం కూడా దీన్ని పెండింగ్‌లో పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ.. మళ్ళీ పాజిటివ్ మోడ్ కనిపించడంతో దీన్ని నాసా.. ట్రాక్ మీదకు తెచ్చేసింది.

ఇప్పుడీ న్యూ హారిజన్స్ కనుక సక్సెస్ అయితే.. ‘ఫ్లూటో’ గ్రహ రహ్యస్యాల్ని ఛేదించడానికి రూట్ క్లియర్ అవుతుందట. ఫస్ట్ ఇమేజెస్ రావడానికి మరో వారం రోజులు పడుతుందని, పూర్తి స్థాయి డేటా కోసం 20 నెలల పాటు వెయిట్ చేయక తప్పదని చెబుతోంది నాసా. కానీ.. అల్టిమా తులే అనేది ఒకటే ఆబ్జెక్ట్ కాదని, కొన్ని వస్తువుల సమూహం కూడా కావొచ్చని కొందరు స్పేస్ సైంటిస్టులు వాదిస్తున్నారు. ఏదేమైనా.. దానికి అతి సమీపంలోకి వెళ్లనున్న నాసా వారి ఫ్లూటో ఎక్స్‌ప్లోరర్‌తో మిస్టరీ వీడిపొయ్యే అవకాశమైతే వుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *