ఉన్ని, పాలిస్టర్ వంటి వాటితో తయారయ్యే దుస్తులు పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయని బ్రిటన్‌లోని నేషనల్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ సంస్థలో పని చేసే సుమారు 10 వేలమంది ఉద్యోగులు ధరించే ఉన్ని దుస్తుల మీద దాదాపు ఆంక్షల వంటివి విధించింది. వీటితో తయారయ్యే దుస్తులను ధరించే బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించింది. వీటిని ఉతికినప్పుడల్లా కోట్లాది చిన్నపాటి ఫైబర్స్ బయటపడతాయని, ఇవి పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతో బాటు నీటి వనరులను కలుషితం చేస్తాయని ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.

చేపలు, పీతల్లాంటి జలచరాల్లోను, చివరకు ఉప్పు, తేనెవంటి వాటిలో కూడా ప్లాస్టిక్ ఫైబర్స్ కనుగొన్నారని వారంటున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యాన నడిచే కన్సర్వేషన్ చారిటీ కూడా తాము 17 షాపులకు విక్రయించే ఉన్ని, పాలిస్టర్ దుస్తులు, ఇతర ఉత్పత్తుల మీద పునరాలోచన చేస్తామని, వీటి వినియోగాన్నిసమీక్షిస్తామని పేర్కొంది.

ఓ కుటుంబం వాడే వాషింగ్ మెషిన్ నుంచి వెలువడే వేస్ట్ వాటర్ లో ఒక లీటరుకు 300 ఫైబర్స్ ఉంటున్నాయని ఇటాలియన్ శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య కనుగొన్నారు. ఇవి పర్యావరణానికి హాని చేస్తాయనడంలో అనుమానం లేదన్నారు. 5 కేజీల వాషింగ్ లోడ్ లో 6 మిలియన్ల నుంచి 17.7 మిలియన్ల ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్ ను ఇటాలియన్ నేషనల్ కౌన్సిల్ సైతం కనుక్కున్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.

చేపలు, తదితర జలచరాలు ప్లాస్టిక్ వ్యర్థాలను మింగుతున్నాయి. వాటిని తింటున్న మనుషుల కడుపుల్లోనూ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇది చాలా సీరియస్ అయిన విషయం..మనం ఇప్పుడే మేల్కొనకపోతే డేంజరేనని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. మొత్తానికి ఉన్ని, ప్లాస్టిక్, పాలిస్టర్ తదితరాల వినియోగానికి పూర్తిగా చెక్ పెట్టాలని నేషనల్ ట్రస్ట్ తో బాటు ఈ సంస్థలు గట్టిగా కోరుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *