ఫిబ్రవరి 14న ఆక్సిజన్ పార్క్‌లో బలవంతపు పెళ్లి చేసుకున్న ప్రేమజంట.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన తర్వాత తమ ముఖం ఇంటివాళ్లకు చూపించలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో శుక్రవారం హైదరాబాద్‌కి వచ్చిన ఆ జంట, సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు వాళ్లని కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు, వాళ్లకి కౌన్సెలింగ్ ఇచ్చి పేరెంట్స్‌కి అప్పగించారు.

ప్రేమికుల రోజున కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన జంటను చూసి భజరంగ్ దళ్ కార్యకర్తలు.. ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన తర్వాత తన కూతురు కనిపించలేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *