మాజీ మంత్రి డీ.ఎల్.రవీంద్రా రెడ్డి త్వరలో వైసీపీలో చేరనున్నారు. పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేసిన దౌత్యం ఫలించడంతో..ఇక డీఎల్….వైసీపీలో  చేరికకు మార్గం సుగమమైంది. పార్టీకి తన సేవలు అవసరమని జగన్ తనకు ఫోన్ చేశారని, చాలా ఏళ్ళుగా వైఎస్ కుటుంబానికి తను సన్నిహితంగా ఉన్నానని ఈ సందర్భంగా డీఎల్ అన్నారు. త్వరలో జగన్ సమక్షంలో పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవల పరిష్కారంలో విఫల మైందని  ఆయన ఆరోపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *