ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నేతలు ఎటువైపు జంప్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. బీజేపీ‌లో చాలామంది నేతలు ప్రధాన పార్టీలతో టచ్‌లో వున్నారు. సమయం చూసుకుని పార్టీ మారేందుకు రెడీగా వున్నారు. గతనెల 27న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈసారి ఆయన పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా? లేక ఆయన కొడుకు హితేశ్ బరిలోకి దిగుతారా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలావుండగా నెల్లూరు జిల్లాలో టూరేసిన దగ్గుబాటి పురందేశ్వరికి మీడియా నుంచి చిక్కు ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరిందని, మీరెప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారని ప్రశ్నించింది. ఒకే కుటుంబానికి చెందినవాళ్లు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు.. మా కొడుకు వైసీపీలో ఉంటే తప్పేంటి? అంటూ ఎదురు ప్రశ్నించారు. అంతేగానీ తన గురించి ఆమె క్లారిటీ ఇవ్వలేదు. టికెట్లు కేటాయింపు సమయంలో రేపటి రోజున పురందేశ్వరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అదే జరిగితే ఆమె విశాఖ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ వుందని అంటున్నారు. గతంలో ఒకసారి ఆమె విశాఖ నుంచి గెలుపొందారు. ఈసారి టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు బరిలోకి దిగే ఛాన్స్ వుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజులు ఆగితే పురందేశ్వరి ఎటువైపు అన్నది తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *