నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బీజేపీ మాజీ ఎంపీ నానా పటోల్‌కు టికెట్ ఇవ్వరాదని దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేస్తున్నారు.

పటోల్ గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006లో మహారాష్ట్రలోని భండారా జిల్లా.. ఖైర్లాంజి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనలో నిందితులకు నానా పటోల్ బాహాటంగా మద్దతునిచ్చారని ఈ సంఘాలు పేర్కొన్నాయి.

నాగపూర్‌లో పెద్ద సంఖ్యలో దళితులున్నారు. వీరంతా నానా పటోల్ అభ్యర్తిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇటీవల జరిగిన అంబేద్కర్ గ్రూపులు ఈ మేరకు తీర్మానించాయి కూడా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *