డీకే అరుణను అణగదొక్కడానికే ఇదంతా..!

డీకే అరుణను రాజకీయంగా అణగదొక్కడానికే నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ బాంబు పేల్చారు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి. నాగంను ఓడించడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తానని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని తనను హరీష్‌రావు ఆహ్వానించారని.. సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఫైనల్ చేస్తామని హరీష్ రావు అన్నారని దామోదర్ రెడ్డి టీవీ9కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని, నాగంను చేర్చుకుని నన్ను పార్టీలో ఉండమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. కాంగ్రెస్‌ పార్టీని జైపాల్‌రెడ్డి భ్రష్టుపట్టించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో నాతోపాటు మరో ఇద్దరు.. కాంగ్రెస్‌ నేతలను బలిచేయాలని చూస్తున్నారని దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.