ఏపీ సీఎం చంద్రబాబుమీద రోడ్డెక్కిమరీ నిరసనకు దిగిన టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుపై కౌంటర్ అటాక్ పడిపోయింది. మంచు శిఖరం మీద దివంగత ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ రావు కోడలు దాసరి సుశీల సంచలన ఆరోపణలు చేశారు. దాసరి కుటుంబానికి మోహన్ బాబు చాలా అన్యాయం చేశారన్నారు. దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో తమకు అన్యాయం చేస్తున్నారని.. దాసరి ఆస్తి పంపకాల్లో పెద్ద మనిషిగా ఉన్న మోహన్ బాబు.. రెండు, మూడు రోజుల్లో ఆస్తి పంచుతామని దాసరి కన్నుమూసిన తర్వాత చెప్పారని.. కానీ ఇప్పటివరకు ఆస్తి పంపకాలు జరగలేదని ఆమె అన్నారు. దాసరి తనయుడు, హీరో, మరిది అరుణ్ కుమార్ పైనా దాసరి సుశీల ఆరోపణలు గుప్పించారు. ఆస్తి పంపకాల అంశం సామరస్యంగా పరిష్కరించుకుందామని దాసరి మరణంరోజు చెప్పిన అరుణ్ ఆ తర్వాత స్పందించడం మానేశారని ఆమె అన్నారు. అరుణ్ కుమార్‌ను అడుగుతుంటే.. మోహన్ బాబు రావాలంటున్నారని, మోహన్ బాబును అడిగితే నాకేం సంబంధం అంటున్నారని ఆమె మీడియా ముఖంగా వాపోయారు. తన బిడ్డ మాస్టర్ దాసరి నారాయణ రావు అన్యాయమైపోతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తన కాలేజీ పిల్లలకు అన్యాయం జరిగిందంటూ ఎన్నికల ముందు మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చినట్టే.. తన కుమారుడికి అన్యాయం జరిగిందని తాను వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *