కాశ్మీర్లో జరిగిన మిలిటెంట్ల ఘాతుకంపై దేశం మొత్తం తీవ్రంగా స్పందిస్తోంది. 40 మంది జవాన్లను పోగొట్టుకున్న ఈ జాతీయ విపత్తు నేపథ్యంలో అందరూ తమతమ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రియాంకా గాంధీ మొట్టమొదటి ప్రెస్ మీట్ రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. మిగతా పార్టీలన్నీ కూడా రాజకీయ కార్యక్రమాల్ని నిలిపివేశాయి. కానీ.. ప్రధాని మోదీ మాత్రం ఈ విషయంలో రాజీ పడ్డారా?

దుర్ఘటన జరిగిన మరుసటి రోజే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి పచ్చ జెండా ఊపే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. సహజంగానే అక్కడ జరిగిన ఫోటో సెషన్‌కి నవ్వుతూ పోజిచ్చారు. దీనికి సంబంధించి ఫొటోల్ని పార్టీ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో మోదీ మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. పుల్వామా విషాదం నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే హుందాగా ఉండేది కదా అంటూ చురకలంటించారు. దీంతో నాలిక్కర్చుకున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *