అసలే ఎన్నికల సీజన్. ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం. అయినా కొంతమంది నాయకుల్లో ఆ సమయస్ఫూర్తి లేకపోగా.. నోటి దూకుడు కంటిన్యూ అవుతోంది. క్యాడర్లో ఉత్సాహం నింపడం కోసం.. సోషల్ మీడియా ఉందన్న బెరుకు కూడా లేకుండా నోటికొచ్చిందల్లా వాగేసి.. తర్వాత నాలిక్కర్చుకుంటున్నారు. ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి.. ఇప్పుడదే చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సొంత పార్టీనే ఇరకాటంలోకి నెట్టేశారు.

జగన్ సీఎం అయితే హైదరాబాద్‌లోనే వుంటారు.. మనోడు సీఎం అయితే.. రాష్ట్రమంతా మనదే. జిల్లాలవారీగా అందరికీ సంపాదించే అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌లో ఎన్నికలు అయిపోగానే ఆర్నెల్ల పాటు మీకందరికీ ‘పర్మిట్లు’ ఇచ్చేస్తాం. ఎవ్వరిని పడితే వాళ్ళను నరుక్కోండి.. అనేశారు ధర్మవరం ఎమ్మెల్యే. ‘ముందు నన్ను గెలిపించండి.. తర్వాత వాళ్ళను కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా.. మీ ఇష్టం..’ అన్న ఎమ్మెల్యే మాటలు విని అక్కడ గుమిగూడిన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఇప్పుడీ ఆడియో తెగ వైరల్ కావడం.. అధిష్టానం దృష్టికి వెళ్లడం కూడా జరిగిపోయింది.

గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని రహస్యంగా కలిసినప్పుడు కూడా ఈయన తెలుగుదేశం అధిష్టానానికి తలనొప్పిగా మారారు. పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *