టైటానిక్ నౌక మునక ఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 1912 ఏప్రిల్ 15‌న సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఈ నౌక ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఓ మంచు కొండను ఢీ కొనడం వల్లే ఇది మునిగిపోయిందని అంతా భావిస్తూ వచ్చారు. అయితే దాదాపు 30 ఏళ్ళుగా ఈ డిజాస్టర్ పై రీసెర్చ్ చేస్తున్న జర్నలిస్ట్ సెనన్ మొలోనీ.. ఈ ప్రమాదానికి ఇంకా కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు.
టైటానిక్ లోని కోల్ బంకర్‌లో మంటలు రేగడం, ఇంధనం అయిపోవడం, మంచు కొండను ఢీకొనకుండా పక్కకు మళ్ళించాలని నౌక కెప్టెన్ తీసుకున్న నిర్ణయం వంటివి దీని మునకకు కారణాలని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ ఘటనలో కెప్టెన్ కూడా నౌకలోని 1500 మందితో బాటు ప్రాణాలు కోల్పోయిన  సంగతి తెలిసిందే. ఎడ్వర్డ్ జాన్ స్మిత్ అనే ఆ కెప్టెన్ కు నౌకలను సురక్షితంగా నడపడంలో ఎంతో అనుభవం ఉంది. కానీ..ఆ దురదృష్ట సమయాన.. అతివేగంగా వీస్తున్న గాలులు, వాతావరణం సరిగా లేకపోవడం వంటివాటి కారణంగా  ఆయన కూడా పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయాడని సెనన్ పేర్కొన్నాడు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *