తెలుగుతేజం ‘ఎన్టీయార్’ జీవితం మీద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ప్రయోగం పూటకో మలుపు తిరుగుతోంది. తాను తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ ప్రమోషన్ కోసం వర్మ పడ్తున్న తంటాలు అన్నీఇన్నీ కావు. చివరికి ఎన్టీయార్ వర్ధంతి రోజు కూడా తన డ్రమటిక్ స్టైల్‌ని కొనసాగించుకున్నాడు. ‘వర్థంతి రోజు బతికొచ్చిన లక్ష్మీస్ ఎన్టీయార్..! తప్పక చూడండి.. ‘ అంటూ శుక్రవారం ట్విట్టర్లో వర్మ పెట్టిన పోస్ట్.. నెటిజన్లలో ఆసక్తిని పెంచేసింది. ఇటు.. పొలిటికల్ వర్గాల్లో టెన్షన్ పుట్టించింది

”వెన్నుపోటుతో హత్య కావించబడ్డ ఎన్టీయార్.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ కోసం మళ్ళీ బతికొచ్చేశారు..” అంటూ తన మూవీలో ఎట్టకేలకు NTR ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు డైరెక్టర్ వర్మ. ఆవేశం, నిర్వేదం కలగలిసిన భావనతో ఎన్టీయార్ గెటప్ ఆసక్తికరంగా వుంది. ఎన్టీయార్ పోలికలు ఒక మోస్తరుగా కుదిరినట్లు కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే, లక్ష్మిపార్వతి, చంద్రబాబు పాత్రలను రివీల్ చేసిన వర్మ.. ఇప్పుడు పెద్దాయన పాత్రను కూడా పరిచయం చేయడంతో.. సినిమా నిర్మాణం జోరుమీదుందన్న సంకేతాలిచ్చేశాడు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు-భువనేశ్వరి పెళ్లి ఫోటో పోస్ట్ చేసిన వర్మ.. ”ఈ పెళ్లి తర్వాత ఏమవుతుందో ఎవ్వరైనా ఊహించగలిగారా?” అంటూ మరో క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. తన సినిమాలో ‘చంద్రబాబు వెన్నుపోటు’ను మాత్రమే కీలక అంశంగా పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ విధంగా సినీ-రాజకీయ వర్గాల్ని అదేపనిగా కెలికేస్తున్నాడు.

జీవీ ఫిలిమ్స్ బేనర్ పై రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ‘లక్ష్మిస్ ఎన్టీయార్’ మూవీ షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న విడుదల కావాల్సి వుంది. కానీ.. ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడ్డ రిలీజ్ డేట్ పై తాజాగా క్లారిటీ లేదు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *