తన మాటలే కాకుండా, తాను తీసే సినిమా నేపథ్యాల్లో కూడా కరకుదనాన్ని చూపే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..! ఆయన మూవీస్‌లో అండర్ కరెంట్‌గా నడిచే సోషల్ మెసేజెస్ కూడా గుండెల్ని తాకేస్తాయి. ఒక్కోసారి రక్తాన్ని ఉడికిస్తాయి కూడా! ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన మిలిటెంట్ల ఘాతుకంపై పూరి స్పందించిన తీరు.. ఆయన నైజాన్ని మరోసారి ఎలివేట్ చేస్తోంది.

”ఇంతకింతా తీర్చుకుంటాం.. దగ్గరలో మరో గుణపాఠం వుంది కాచుకో” అంటూ ఏకంగా ప్రధాని మోదీయే పాకిస్తాన్‌కి హెచ్చరించారు. ఇంకొక్కసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి.. దాయాది దేశం గుండెల్ని చీల్చాల్సిందేనంటూ పూరీలాగే దేశం యావత్తూ కోరుకుంటోంది. ఇటీవల కొడుకు ఆకాష్ హీరోగా పూరీ తీసిన ‘మెహబూబా’ మూవీ సైతం దేశభక్తి నేపథ్యంతో సాగింది. షూటింగ్ కోసం పూరీ కాశ్మీర్ సరిహద్దుల్లో గడిపొచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *