ఏపీ పాలిటిక్స్‌ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో చెప్పడానికి ఇదీ ఒక సాక్ష్యం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పెను మార్పుల్లో భాగంగా.. ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు. లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న ఆయన ఎటువంటి షరతులు లేకుండా వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. తనకు టిక్కెట్ ఇస్తానని ఆశ చూపి మోసం చేశారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఇదే సీన్‌ని తనకు అనువుగా మార్చుకుని ఎంట్రీ ఇచ్చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమాలోని దగాదగా అంటూ సాగే ‘వెన్నుపోటు’ పాట విడుదల చేసినప్పుడు.. అందరికంటే ఎక్కువగా స్పందించింది ఎస్వీ మోహన్ రెడ్డే. ”ఈ పాట మా చంద్రబాబు ప్రతిష్టను భంగపరిచేలా వుంది” అంటూ డైరెక్టర్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని.. వర్మ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘వెన్నుపోటు పాటను నిరసించిన చంద్రబాబు వీరవిధేయుడు.. ఇప్పుడు ఆ చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచి వైసీపీలో చేరారు.. ఇది నిజం.. నమ్మండి” అంటూ వెటకారమాడారు. ఏపీ పాలిటిక్స్ విషయంలో వర్మ ఎంత అలర్ట్‌గా వున్నారో కదా!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *