‘కెలకడం అంటూ మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవ్వడూ కెలకలేడు..’ అంటూ తన నైజాన్ని ఓపెన్‌గా ఒప్పేసుకునే టెంపరోడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే సినిమా ఫీల్డ్‌ని తెగ దున్నేసిన వర్మ.. ‘అతడొక కలుపుమొక్క’ అంటూ చాలామందితో సర్టిఫికెట్ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్‌లోకి ఇండైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశాడు. తెలుగు రాజకీయాల్ని కీలక మలుపు తిప్పిన తెలుగుదేశం పార్టీతో చెండాట షురూ చేశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ పేరుతో వర్మ తీస్తున్న బయోపిక్ ఇప్పటికే ఆ పార్టీ తాజా శ్రేణుల్ని ఉడుకెత్తిస్తోంది. ‘దగా దగా’ అంటూ వెన్నుపోటు పాటొకటి రిలీజ్ చేసి.. పచ్చ క్యాడర్‌ని కసెక్కించిన వర్మ.. ఆ టెంపోని కంటిన్యూ చేసుకుంటున్నాడు. మార్చి 22న విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ప్రమోషన్ కోసం పాలిటిక్స్‌లో సైతం వేలు పెట్టేశాడు డైరెక్టర్ వర్మ. ఎన్నికల షెడ్యూల్ బైటికొచ్చి సరిగ్గా నెలరోజుల్లో పోలింగ్‌కి వెళ్ళబోతున్న తెలుగు రాష్ట్రాల్లో వర్మ మార్క్ ఓట్ల లొల్లి మొదలైంది. ”ఫలానా పార్టీకి ఓటెయ్యకండి.. ఇది స్వర్గంలో వున్న ఎన్టీయార్ ఇచ్చిన సందేశం” అంటూ వర్మ విడుదల చేసిన ఒక ఆడియో కమ్ వీడియో.. ఇప్పుడు వైరల్ అవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *