ప్రస్తుతం ‘మహర్షి’ ప్రాజెక్టు మీదున్న మహేష్ బాబు.. తదుపరి సినిమాల మీద కూడా తరచూ ‘సిట్టింగ్’ వేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న మహర్షి రిలీజ్‌కి ముందే.. మరుసటి సినిమా షూట్ మొదలుపెట్టాలన్నది మహేష్ ప్లాన్. ఇప్పటికే కథాచర్చలు ముగించుకుని సిద్ధంగా వున్న సుకుమార్ మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈలోగా.. హీరోయిన్ వేట కూడా ఓ కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మహేష్#26 ఫిమేల్ లీడ్ రోల్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఓకె అయ్యిందట. డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ రికమెండేషన్‌తోనే రకుల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రకుల్ తో కలిసి ‘నాన్నకు ప్రేమతో’ మూవీ చేసిన సుకుమార్.. ఆమె వర్కింగ్ నేచర్‌కి ఫ్లాట్ అయ్యాడని, అందుకే ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడని చెబుతున్నారు.

మహేష్ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ‘స్పైడర్’ మూవీలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రకుల్‌ని చూడగానే స్పైడర్ జ్ఞాపకాలు వచ్చేస్తాయి కనుక.. ఆమెను ముందుగా మహేష్ రిజెక్ట్ చేశాడట. కానీ.. సుకుమార్ పట్టుబట్టి రకుల్‌ని పెట్టుకున్నాడట. ఇటు.. ‘వన్ నేనొక్కడినే’ తరహాలో ‘మైండ్ గేమ్’ లైన్‌తో నడిచే కథను సిద్ధం చేసుకున్న సుకుమార్.. మహేష్ కెరీర్‌ని మళ్ళీ పీక్స్‌లోకి తీసుకెళ్తాడన్న ఆశలైతే ఫ్యాన్స్‌కి వున్నాయి. ఆలోగా ‘మహర్షి’ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కనుక.. టాలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ మీద కొత్త క్లారిటీ కలగొచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *