కొందరికి రక్తం కనిపిస్తే కళ్ళు తిరుగుతాయి. కొందరికి ఆస్పత్రి వాసన అంటేనే ఎలర్జీ. మరికొందరికి డాక్టర్ని చూస్తేనే ఒకలాంటి ఆందోళన. తెలీకుండానే వణుకు పుట్టేస్తుంది. దీన్నే మెడికల్ పరిభాషలో ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటున్నారు. ఆస్పత్రి వాతావరణంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. అక్కడున్న మెడికల్ సెట్టింగ్స్ కంటబడగానే.. శరీరంలో మార్పులు కలిగి.. అసలు వ్యాధిని మరుగు పరచడం అనేది నిజంగానే ఒక సమస్య. దీన్నుంచి బైటపడ్డానికి కొన్ని ఆస్పత్రులు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసుకుంటున్నాయి కూడా.

తెల్లకోటు వేసుకున్న డాక్టర్‌కి ఎదురుగా కూర్చోగానే రక్తపోటు పెరిగి.. రీడింగ్స్ లో మార్పులు కనిపించడంతో.. అప్పటికప్పుడు చేయాల్సిన ఎమర్జెన్సీ సర్జరీలు కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు అనేకం. మామూలు పరిస్థితుల్లో సాధారణ బ్లడ్ ప్రెసర్ లెవల్స్ ఉన్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరి చెకప్ సమయానికి.. హైపర్ టెన్షన్ కారణంగా బీపీ లెవెల్స్ పెరిగిపోవడం అనేది.. ఒక రెగ్యులర్ ఇష్యు అంటున్నారు డాక్టర్లు.

అందుకే వైట్ కోట్ సిండ్రోమ్ కలిగినవాళ్లను డాక్టర్లు స్పెషల్ గా ట్రీట్ చెయ్యాల్సిన పరిస్థితి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. కొంతకాలం మంచి వాతావరణంలో తిరిగి రమ్మని చెప్పడం.. ఒకటికి రెండుసార్లు డయాగ్నైజ్ చెయ్యడం లాంటి తాత్కాలిక చర్యలు తప్పితే డాక్టర్ల దగ్గర ఇప్పటికైతే మరో మార్గం లేదు. అయితే.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటువంటి పేషేంట్స్ కోసం స్పెషల్ వార్డ్స్ ఏర్పాటై ఉంటాయి. రోగులకు తగిన వాతావరణాన్ని కల్పించి, సివిల్ డ్రస్ వేసుకున్న నర్సులతో సర్వీస్ చేయిస్తూ దానికి తగిన ఛార్జ్ వసూలు చేయడం.. కొత్త వ్యాపారమార్గం. గతంతో పోలిస్తే.. ఇటీవలికాలంలో ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అనేది కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోందన్నది కూడా వాస్తవం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *