ముంబైలో డిజైనర్ రోహిత్ బాల్ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షో లో ఓ వీధికుక్క కూడా  ‘పార్టిసిపేట్’  చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యాక్టర్లు సిద్దార్థ్ మల్హోత్రా, డయానా పెంటే, ఇతర మోడల్స్ పాల్గొన్న ఈ షో లో ఈ  ‘శునకం గారి ర్యాంప్ వాక్’  ‘వండర్’  అంటున్నారు.

సిద్దార్థ్ ర్యాంప్ ఎక్కడానికి జస్ట్.. కొద్ది క్షణాలకు ముందే ఎక్కడినుంచి వచ్చిందో.. ఈ కుక్క కామ్‌గా ‘ రంగప్రవేశం ‘ చేసి..అలా వచ్చి..ఇలా వెళ్ళింది. నిన్ననే తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న సిద్దార్థ్ ఈ డాగ్ ఎంట్రీని లైట్‌గా తీసుకున్నాడు. ఈ తమాషా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2018’ పేరిట ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. లోగడ టర్కీలో ఇలాగే ఓ ఫ్యాషన్ షో జరుగుతుండగా.. ఓ పిల్లి దర్జాగా తానూ ‘క్యాట్ వాక్’ చేసిన విషయాన్ని నెటిజనులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నవ్వుకుంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *