ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓట్ల శాతం తమపార్టీకే ఉందని.. త్వరలో జరుగబోతోన్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం అవుతానని ఘంటాపథంగా చెప్పుకొచ్చిన ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏపాల్ రూట్ మార్చారు. లోక్ సభ కు పోటీ చేస్తానంటూ కొత్త శ్లోగన్ అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పాస్టర్ల సదస్సులో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించడమే ప్రజాశాంతి పార్టీ విధానమన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *