‘నేనే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి.. కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా.. జగన్‌ సీఎం కాలేడు.. పవన్‌ కల్యాణ్‌ ప్రభావం ఉండదు. సీఎం కాగానే చంద్రబాబును సలహాదారుడిగా పెట్టుకుంటా..’ ఇలా.. 2019 ఎన్నికలకు
సంబంధించి భూత, భవిష్యత్, వర్తమానాల గురించి చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయెనెవరోకాదు.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ కేఏపాల్. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్ శుక్రవారం గుంటూరు,
విజయవాడలో మీడియా తో మాట్లాడారు. 2019లో తాను అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన ఇప్పటికే అనేక సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు
తన్ను అడ్డుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గెలిచిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ ప్రభావం ఉండదన్న పాల్.. ప్రతిపక్ష నేత
వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడంటూ పాల్ కుండబద్ధలు కొట్టారు. మోదీ చంద్రబాబు కలిసి తన సంస్థకు నిధులు రాకుండా నిలిపేశారని ఆరోపణ చేశారు. బాబు – మోదీ శాశ్వత మిత్రులని ఇప్పుడు వారితో జగన్‌
కూడా కలిశారని చెప్పుకొచ్చారు. మోదీ రెండోసారి ప్రధాని కావడం అసంభవమని, 18 పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయని పాల్ జోస్యం చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *