మతిమరపు దాదాపు అందరికీ సహజం. మన సన్నిహితుల బర్త్‌డేలో, పెళ్లిల్లో, ఇతర కార్యక్రమాలో గుర్తున్నట్టే ఉంటాయి. తీరా సమయం వచ్చాక వాటిని మర్చిపోతాం.. అందుకే ఇలా మరవకుండా ఉండాలంటే పెన్ను, పేపర్ తీసుకుని డ్రాయింగ్ వేసేందుకు ఉపక్రమించండి..అది బెస్ట్ అంటున్నారు నిపుణులు. కెనడాలోని వాటర్ లూ యూనివర్సిటీ రీసెర్చర్లు స్వయంగా పరిశోధించి ఈ విషయం తేల్చారు. శాస్త్రీయంగా దీన్ని రుజువు చేశారు కూడా. రాసే బదులు డ్రాయింగ్ వేయడం సులభం కూడా.48 మందిని ఎంపిక చేసుకుని, వారికి కొన్ని సింపుల్ టెస్టులు నిర్వహించి ఈ విషయం తెలుసుకున్నాం అని వీరు తెలిపారు. తాము నిర్దేశించిన పదాలను రాసిన వాళ్ళ కన్నా వాటి ఫోటోలను చిత్రించిన వారిదే పై చేయి అయింది.. వీళ్ళలో కొందరు యువకులు, వృద్ధులు కూడా ఉన్నారు. కాలేజీ యువతతో పోలిస్తే. వృద్ధులే టాప్‌గా నిఇచారు. అని ఈ పరిశోధకులు వెల్లడించారు. చిత్ర లేఖనం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా వీరు పేర్కొన్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *