కాలిఫోర్నియా నగరం నడిమధ్యన.. శాన్ పాబ్లో బే ఏరియాలో ఏడెకరాల విస్తీర్ణమున్న ఒక అరుదైన, అద్భుతమైన దీవి. ‘ఈస్ట్ బ్రదర్స్ లైట్ హౌస్’ అనే సంస్థ దీని మెయింటెనెన్స్ కోసం నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇక్కడ విధులు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే.. ‘లక్కీ కపుల్స్ ఎవరైనా వుంటే రండి’ అంటూ ఒక బంపరాఫర్ ఇవ్వజూపింది.

ఈ దీవిలోని నాలుగు పడగ్గదుల్ని, వంటగదిని పద్ధతిగా చూసుకోవడం.. మెయిన్‌ల్యాండ్ విజిటర్స్‌కి 10 నిమిషాల పాటు బోట్ రైడ్ ఏర్పాటు చెయ్యడం.. ఇవీ చెయ్యాల్సిన పనులు. వారానికి లక్షా 30 వేల డాలర్లు అంటే.. దాదాపు 90 లక్షల రూపాయలు ఆఫర్ చేస్తోంది.

ఈ అందమైన దీవిని విజిట్ చేయడమే ఒక అదృష్టం. ఇక్కడ వారంలో నాలుగు రోజులు డ్యూటీ చేయడమంటే..! అందుకే ఆ లక్కీ కపుల్ ఎవరో.. త్వరపడండి.. ఆలసించిన ఆశాభంగం..! అంటూ అనౌన్స్ చేస్తోంది ‘ఈస్ట్ బ్రదర్స్ లైట్ హౌస్’ అనే ఈ నాన్ ప్రాఫిటింగ్ టూరిజం సంస్థ. 1873 నాటి పురాతనమైన ఈ లైట్ హౌస్ ఐలాండ్.. కాలిఫోర్నియా వాసులకు మంచి పిక్నిక్ స్పాట్!

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *