పండ్లు, కాయగూరలతో బాటు..పిండి పదార్థాలతో కూడిన గింజలను తింటే మెదడు చురుకుగా పని చేస్తుందని,, మతిమరుపు వంటి రుగ్మతలు సోకవని ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం మరీ కరెక్ట్ కాదని అంటున్నారు రీసెర్చర్లు. ఇలాంటి ఆహారం తిన్నంత మాత్రాన మెదడు సంబంధ రుగ్మతలు సోకవనడానికి ఆధారాలు లేవని బ్రిటన్ లోని సైంటిస్టులు ఓ కొత్త విషయాన్ని ప్రకటించారు. వీరు సుమారు రెండు దశాబ్దాల పాటు అనేకమందిని, వారి ఆహారపు అలవాట్లను పరీక్షించి ఈ విషయం తేల్చారు.

హెల్దీ డైట్ తీసుకున్నంతనే అల్జీమర్స్, ఇతర వ్యాధులు రావన్నది పాత థియరీ.. మేం చేసిన పరిశోధనలు ఇందుకు ఆధారాలు లేవని నిరూపిస్తున్నాయి అంటున్నారు వీళ్ళు. బ్రిటన్ లో ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షలమంది అల్జీమర్స్ కి గురయ్యారని అంచనా. ఇది 2025 నాటికి సుమారు 10 లక్షలకు పెరగవచ్చునంటున్నారు. అలాగే అమెరికాలో ఆరు మిలియన్లమంది ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నారు. బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు, ఫ్యాటీ యాసిడ్లు, పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌తో కూడిన ఫుడ్ తిన్న వారికి, పండ్లు, కాయగూరలు తిన్నవారికి మధ్య తేడా పెద్దగా ఏమీ కనబడలేదని, ఈ వెజ్ ఫుడ్ తిన్నవారు కూడా మెదడు సంబంధ రుగ్మత ఉన్నవారేనని రుజువైందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *