ఏపీ సిఎం చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికలసంఘం సీరియస్ అయింది. ఆయనకు నోటీసులు జారీ చేస్తూ..ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. అయితే తానిప్పుడు అనారోగ్యంతో. నడవలేనని స్థితిలో ఉన్నానని, ఆసుపత్రిలో చికిత్స చేయించు కుంటున్నానని  పోసాని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఇంకేమీ చెప్పలేనంటూ ఈసీకి పంపిన లేఖలో తెలిపాడు. అయినా తానేమీ బాబును  కించపరిచే కామెంట్స్ చేయలేదని వివరించాడు. దీనిపై ఈసీ ఏమంటుందో చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *