స్పేస్ ఎక్స్ సిఈవో ఎలన్ మాస్క్ మరో విజయం సాధించాడు. ఇతని సంస్థ.. ఫాల్కన్ హెవీ మెగా రాకెట్..ఫస్ట్ కమర్షియల్ మిషన్‌ను విజయవంతంగా సాధించింది. లాక్‌హీడ్ మార్టిన్ అరబ్‌శాట్-6 ఎ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని తనతో బాటు మోసుకుపోయి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పైగా మూడు బూస్టర్లను తిరిగి మొదటిసారిగా భూమిపైకి ఈ రాకెట్ పంపింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ఈ నెల 11 న నిప్పులు కక్కుతూ నింగికి ఎగసింది.

అట్లాంటిక్ మహాసముద్రంలోని స్పేస్ ఎక్స్ ఆఫ్ షోర్ లో గల కేంద్రంలో ఈ రాకెట్ సేఫ్ గా దిగిందని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. అలాగే రెండు బూస్టర్లు కేప్ కెనవరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని జోన్లకు చేరుకున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది తొలి కమర్షియల్ పే లోడ్ ని స్పేస్ లోకి పంపిన ప్రక్రియ అని, జియో సింక్రొనస్ కక్ష్యలోకి అరబ్ శాట్ 6- ఎ ఉపగ్రహ ఎంట్రీ సక్సెస్ అయ్యిందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేసింది. ఈ కంపెనీ రూపొందించిన హెవీ ఫాల్కన్ రాకెట్ గతంలోనూ విజయవంతంగా శాటిలైట్ ను కక్ష్య లో ప్రవేశపెట్టింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *