నాలుగేళ్ల కిందటి ‘ఓటుకు నోటు’ కేసులో కీలక కదలిక చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని ఓ పట్టు పట్టిన ఈ కేసు కొలిక్కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నాటి టీడీపీ ఎమ్మెల్యే, నేటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కీలక నిందితుడు రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

మంగళవారం నాడు.. అప్పటి టీడీపీ నేత, కేసులో కీలక ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వేంనరేందర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కొడుకుల్ని కూడా ఈడీ అధికారులు విచారించారు. ముగ్గురినీ విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా తన కొడుకుల్ని పిలిచి ఇబ్బంది పెట్టడం ఏమిటని వేం నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. స్టీఫెన్సన్‌కి ఇవ్వజూపిన రూ. 50 లక్షలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉండడంతో.. దాని ఆధారంగా ఈడీ క్వశ్చనీర్ నడిచింది. ఈ 50 లక్షలకు, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చిన నాలుగున్నర కోట్లకు సంబంధించి ‘సోర్స్ ఆఫ్ ఇన్ కమ్’ మీదనే ఈ ముగ్గురినీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వీళ్ళ నుంచి రాబట్టిన పాయింట్ల ఆధారంగా.. రేవంత్ రెడ్డిని నిలదీయనున్నట్లు సమాచారం. ఆడియోలో వినిపించిన వాయిస్ ఎవరిదన్న ప్రశ్నలు కూడా సంధించే అవకాశం వుంది. ఈసారి.. చంద్రబాబు పేరు బైటికి వస్తుందా రాదా అనే ఆసక్తి నెలకొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *