ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం ఆదివారం ఉదయం కుప్పకూలిపోయింది. రాజధాని ఆడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ విమానం కూలిపోగా..ఇందులో ప్రయాణిస్తున్న 149 మందితో బాటు 8 మంది విమాన సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు.

ఇథియోపియా రాజధానికి సుమారు 50 కి.మీ. దూరంలోని బిషోఫ్తు వద్ద ఈ ప్లేన్ కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. కేవలం నాలుగు నెలల క్రితమే ఎయిర్ లైన్స్ లో ఈ విమానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *