ఇథియోపియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించినవారిలో ఏపీ..గుంటూరుకు చెందిన డాక్టర్ నూకవరపు మనీషా కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 157 మంది మృతి చెందగా.. వీరిలో నలుగురు భారతీయులున్నారు. మనీషా మృతి విషయం తెలిసి గుంటూరులోని ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె అయిన మనీషా నాలుగేళ్ల క్రితమే మెడిసిన్ పూర్తి చేసి అమెరికా వెళ్ళింది. కెన్యా రాజధాని నైరోబీలో ఉంటున్న ఈమె సోదరి లావణ్యకు ఇటీవలే డెలివరీ కావడంతో ఆమెను చూసేందుకు మనీషా ఇథియోపియా బయల్దేరింది. అక్కడి నుంచి నైరోబీ వెళ్లేందుకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం ఎక్కింది. అయితే టేకాఫ్ అయిన ఆరు నిముషాలకే ఈ విమానం కూలిపోగా అందులోని 157 మందీ మృత్యువాత పడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *