క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన మాజీ ఆటగాడు గౌతమ్‌గంభీర్‌.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం ఉదయం అరుణ్‌‌జైట్లీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. గంభీర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన అరుణ్ జైట్లీ.. ఆపై కండువా కప్పారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయనకు బరిలోకి దిగే అవకాశముందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీజేపీతో గంభీర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

2014 ఎన్నికల్లో పంజాబ్ నుంచి బరిలోకి దిగారు జైట్లీ. ఆయన తరపున గంభీర్ ప్రచారం నిర్వహించాడు. కాకపోతే ఆ ఎన్నికల్లో జైట్లీ ఓటమి పాలయ్యారు. సింపుల్‌గా చెప్పాలంటే జైట్లీకి వీర విధేయడు అన్నమాట. రీసెంట్‌గా పద్మ అవార్డును అందుకున్నాడు. 37 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్.. ఈసారి ప్రత్యక్ష బరిలోకి దిగనున్నాడు. ఇన్నాళ్లు బ్యాట్‌తో అభిమానులను దగ్గరైన గంభీర్‌.. ఢిల్లీ ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. సినిమా నటుల మాదిరిగానే మాజీ క్రికెటర్లు కూడా రాజకీయాల్లో చాలామంది రాణిస్తున్నారు. వాళ్లలో సిద్ధూ, అజారుద్దీన్, కీర్తి ఆజాద్, కైఫ్ వంటి నేతలున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *