ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తవాళ్లు తెరపైకి వస్తున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావు జనసేన పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సెలక్షన్ కమిటీకి తన బయోడేటాని అందజేశాడు వేణు. గతంలో జనసేనలో చేరిన మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావు, ఈసారి జనసేన తరపున విశాఖ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నాడు.

విశాఖ సిటీ పరిధిలోని గాజువాక నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అప్పుడే తనవంతుగా ప్రచారం మొదలుపెట్టినట్టు సమాచారం. అదే గాజువాక నుంచి చాలామంది అభ్యర్థులు తమకు టికెట్ ఇవ్వాలని జనసేనకు అప్లై చేశారు. చివరకు సెలక్షన్ కమిటీ ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *